Sunday, September 20, 2026
No menu items!
HomecinemaVenuswamy: నటి ప్రగతి కామెంట్స్‌.. వేణుస్వామి కౌంటర్

Venuswamy: నటి ప్రగతి కామెంట్స్‌.. వేణుస్వామి కౌంటర్

📰 Generate e-Paper Clip

Venuswamy: నటి ప్రగతి కామెంట్స్‌.. వేణుస్వామి కౌంటర్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీ నటి నుంచి వెయిట్ లిఫ్టర్‌గా మారిన ప్రగతి (actress Pragati), అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పతకాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల టర్కీలో జరిగిన టోర్నీలో ఆమె నాలుగు మెడల్స్ సాధించి స్పూర్తిగా నిలిచారు. ఈ విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రగతి (actress Pragati), వేణుస్వామి (Venuswamy) వద్ద పూజలు చేయించుకున్నది నిజమేనని, అయితే అది గతంలో మానసికంగా కష్ట సమయంలో జరిగిందని తెలిపారు. ప్రగతి కామెంట్స్‌పై వేణుస్వామి (Venuswamy) తాజాగా కౌంటర్ ఇచ్చారు.

ప్రగతి (actress Pragati) వ్యాఖ్యలపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి (Venuswamy) తీవ్రంగా స్పందించారు. “నా వల్ల ప్రగతి గారు గెలిచారని చెప్పుకునే నీచుడిని నేను కాదు. ఒక మహిళ కష్టపడి సాధించిన విజయానికి వందకి వంద శాతం ఆమెకే క్రెడిట్ ఇవ్వాల్సిందే” అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తాను ఎప్పుడూ ఎవరి మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకోలేదని, అలాంటి అవసరం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. తాను కేవలం భగవంతుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తానని, ఆ పూజల వల్ల ఎవరికైనా మంచి జరిగితే అది దేవుడి కృపగా భావిస్తానని అన్నారు.

అయితే ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, వెయిట్ లిఫ్టింగ్ కెరీర్‌లో గానీ ఎలాంటి ప్రత్యక్ష మార్పు రాలేదని ప్రగతి తేల్చిచెప్పారు. రాత్రింబవళ్లు తాను పడిన కష్టం, క్రమశిక్షణతో చేసిన సాధన, ట్రైనింగ్ వల్లే ఈ మెడల్స్ సాధ్యమయ్యాయని వెల్లడించారు. అప్పుడెప్పుడో జరిగిన పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇప్పుడు బయటపెట్టి తన విజయాల క్రెడిట్‌ను వేణుస్వామి (Venuswamy) తీసుకోవడం సరికాదని, అది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రగతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “ప్రగతి గారు నా వల్ల గెలిచారని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆమె విజయానికి కారణం ఆమె కష్టం, దేవుడి అనుగ్రహం మాత్రమే” అంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. మొత్తానికి, ప్రగతి సాధించిన అంతర్జాతీయ విజయాలపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే, ఆ విజయాల క్రెడిట్ చుట్టూ జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page