Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadతెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వినయ్ కుమార్

తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వినయ్ కుమార్


హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :        ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ తెలంగాణ విమోచన దినోత్సవం 17 సెప్టెంబర్ ను రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లోని అశోక్‌న‌గ‌ర్ సర్కిల్, ఆంధ్రా కేఫ్ చౌరస్తా, సబర్మతి నగర్ ఎల్ఐసి బ్రిడ్జి వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో పాటు డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… నిరంకుశ నిజాం రాక్షస పాలనకు చరమగీతం పాడి, నిజాం మెడలు వంచి, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువు అందించడానికి పోరాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పానికి నీరాజనాలు అని అన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో భారత మిలటరీ ధైర్య సాహసాలు, అసువులు బాసిన తెలంగాణ పోరాట అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, రాజు, సురేష్ రాజు, మదన్మోహన్, లక్ష్మణ్ యాదవ్, కుమార్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, సంధ్యా రాణి, మంగమ్మ, సంయుక్తా రాణి, పూర్ణ, లక్ష్మి, కృష్ణ వేణి, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page