తాగునీటి వృథా.. ఇద్దరికి ఫైన్..!
– ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా… రోడ్ నం. 12 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి స్థానిక మేనేజర్ ను లీకేజికి కారణాలు అరా తియ్యాలని ఆదేశించారు.. దీంతో ఓ అండ్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కార్, బైక్ కడిగాడు. ఇదే విషయం ఎండీకి విన్నవించారు.. దీంతో ఎండీ అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు. అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.10000 జరిమానా విధించారు. అలాగే ఆ ప్రాంతంలోనే మరో వ్యక్తి తాగునీటి సంపు నిండి ఓవర్ ఫ్లో అయి దాదాపు ఒక కిలో మీటర్ వరకు తాగునీరు రహదారి పై ప్రవహించింది. నిర్లక్ష్యంతో నీటిని వృధా చేసినందుకు ఈ వ్యక్తికీ రూ.5000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండి అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

