హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : నగరంలోని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP) ను ట్రాన్స్‌మిషన్, క్యూఏటి అధికారులతో కలిసి మంగళవారం జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా క్లోరిన్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ లను పరిశీలించిన ఈడీ లాబ్‌లోని నీటి నాణ్యత పారామీటర్‌లను తనిఖీచేశారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో నీటిశుద్ధి ప్రక్రియలో వినియోగించే రసాయనాలను సకాలంలో కొనుగోలుచేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ట్రాన్స్‌మిషన్ సీజీఎం బ్రిజేష్, క్యూఏటి జీఎం శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply