బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం – తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి

బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం
– తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి

హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :     బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామ‌ని తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ( డీసీపీయు ) అధికారులతో బుధ‌వారం రివ్యూ సమావేశం హైదరాబాద్ మధురానగర్ తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ కార్యాలయంలో జ‌రిగింది. ఈ స‌మావేశంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. డీసీపీయులు తమ తమ జిల్లాల్లో బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించారు. ఈ స‌మావేశంలో 2025 ఏప్రిల్ – జూలై మధ్యకాలంలో చేపట్టిన చర్యల పై సమీక్షించారు. బాల్య వివాహాల నివారణకు జిల్లాల వారీగా తీసుకున్న చట్టపరమైన, ముందస్తు చర్యలుతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం నిర్వహించిన కార్యక్రమాల గురించి, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా రిస్క్యూ అయిన బాల కార్మికుల వివరాలు తెలుసుకోవ‌డం చ‌ర్చించారు.                                            పునరావాసం పొందిన పిల్లల సంఖ్య, తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పిల్లల వివరాలు, లైంగిక వేధింపుల నివారణకు చర్యలు, కౌన్సిలింగ్ సేవలు, ఎస్‌జెపియు, సిడ‌బ్ల్యూసి సమన్వయంతో ఐఈసి కార్యక్రమాల నిర్వహణ పై తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీపీవోలు సిబ్బంది కొరత, బడ్జెట్, మౌలిక సదుపాయాల వంటి సవాళ్లను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కమిషన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించనుందని తెలిపారు. రానున్న కాలంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమీక్షను ప్రాముఖ్యతగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో కమిషన్ సభ్యులు అపర్ణ, చందన, వందన గౌడ్, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్, అడిషనల్ సిడిపిఓలు రమణ చారి, చందనేశ్వరి, షబానా, 33 జిల్లాల డీసీపీవోలు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page