Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసికింద్రాబాద్‌లో గ‌త ప‌దేళ్లలో అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాం – ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావుగౌడ్

సికింద్రాబాద్‌లో గ‌త ప‌దేళ్లలో అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాం – ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావుగౌడ్

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్‌లో గ‌త ప‌దేళ్లలో అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాం

– ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావుగౌడ్

సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :    సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత పదేళ్ళ కాలంలో అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించామని శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తెలిపారు. శుక్రవారం మెట్టుగూడ డివిజన్ పరిధిలో రూ.1.30 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ది కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మెట్టుగూడ, స్కై లాబ్ హోటల్ వద్ద రూ.12.70 లక్షలు, విజయపురి, బతుకమ్మ కుంట ప్రాంతాల్లో రూ.70 లక్షల ఖర్చుతో సిసి రోడ్డు నిర్మాణం పనులు, విజయపురి కాలనీలో రూ.12.80 లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్, మెట్టుగూడ కూడలిలో రూ.7 లక్షల ఖర్చుతో కూడలి సుందరీకరణ పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప‌ద్మారావుగౌడ్‌ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియ అని, పాలకులు ప్రజలకు అందుబాటులో నిలుస్తూ వారి సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. సికింద్రాబాద్ ప్రజల ఆదరణ తమ పట్ల ఎన్నటికీ ఉంటుందని, ప్రజల అవసరాలను గుర్తించి వ్యవహరిస్తున్నామని తెలిపారు.

విజయపురి కాలనీ, మెట్టుగూడ ప్రాంతాల్లో స్థానికులు పలు సమస్యల పై చేసిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు పద్మారావు గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ రాసురి సునీత, వివిధ విభాగాల అధికారులు రంజీత్, సరిత, సదజ, చంద్రశేఖర్, యువ నేతలు తీగుళ్ళ కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, అధికారులు, స్థానిక ప్రముఖులు, సమన్వయకర్త రాజ సుందర్ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page