Friday, September 18, 2026
HomeNationalఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నాం – సిపిఐ రాష్ట్ర...

ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నాం – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 

ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నాం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 

తెలంగాణ బ్యూరో, మే 7, అద్దం న్యూస్ :    ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను భారత సేన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నామ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయడం జరిగిందని, రేవంత్ రెడ్డి ఆవేదనతో ఆవేశంతోను, ఆందోళనతోను ఓ ప్రకటన చేశారని సాంబ‌శివ‌రావు అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు, దేశం లేదన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులే బెనజీర్ భుట్టోను హత్య చేశారని, పాకిస్తాన్ దేశం ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుందన్నారు. కచ్చితంగా చెడును నియంత్రించాల్సిందే, న్యాయాన్ని బతికించుకోవాలని, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తుందని తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, ఆపరేషన్ సిందూరు విజయవంతం కావాలని కోరుకుంటున్నామ‌ని తెలిపారు. భారత ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల‌ని, ఉగ్రవాదాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలన్నారు. కాశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, ఆ సమస్యను పరిష్కరించకపోవడం వలన అమాయకులు బలవుతున్నారన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలానో ప్రభుత్వం త్వరగా ఆలోచించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలన్నారు. భారతదేశం సహనానికి మారుపేరు అని, శాశ్వతంగా ఉగ్రవాదం నుంచి విముక్తి జరగాలన్నారు. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించామ‌ని, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఆర్టీసీలో యూనియన్లను నడిపే హక్కును ప్రభుత్వం కల్పించాలని, గత ప్రభుత్వం లానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందన్నారు. యూనియన్ నడిపే హక్కు బ్రిటిష్ కాలం నుంచే ఉందని, యూనియన్లను నడపకుండా యూనియన్లను రద్దు చేసింది కేసీఆర్ అని అన్నారు. యూనియన్ గుర్తింపు ఎన్నికలు పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోరామ‌ని, కొన్ని సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామ‌న్నారు. సీఎం ఓర్పు, సహనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దాలని, ఈ సమస్యకు కారణమైన వాళ్ళు ఎవరో ప్రజలకు అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బిఆర్ఎస్ చేసిన తప్పులను దాచుకొని ఈ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుందని, ఈ విమర్శల నుంచి ఎలా బయటపడాలో రేవంత్ రెడ్డి ఆలోచించాలన్నారు. రెండు ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బెటర్ గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటికీ కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసింది, ధర్నా చౌక్లు రద్దు చేసింది, టి ఏ లు, డిఏలు ఇవ్వకుండా ఇబ్బంది చేసింది మీరు కాదా సాంబ‌శివ‌రావు ప్ర‌శ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని, గతంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది మీరు కాదా అని ప్ర‌శ్నించారు. బిఆర్ఎస్ పార్టీకి నాయకులకు మాట్లాడే హక్కు లేదని, ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలన్నారు. అమలు చేసే హామీలను వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక కమిటీని వేయాల‌న్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో ఆర్థికవేత్తలతో చర్చించి ఒక కమిటీని వేయాలని అన్నారు. వాటిలో ముఖ్యంగా సన్న బియ్యం, రైతులకు బోనస్సు మంచిగా ఉన్నాయని, ప్రభుత్వం తీసుకునే ఏ స్కీం అయిన లోతుగా వెళ్లి విశ్లేషణ చేయాలన్నారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ల‌ను ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అని వెంటనే విడుదల చేయాలన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page