కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తాం
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 16, అద్దం న్యూస్ : కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ప్రతి రోజు మంచినీటికి బదులు కలుషిత నీటి సరఫరా కావడంతో, అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని కి అరుంధతినగర్ బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్ సూచనల మేరకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జలమండలి డిజిఎం వెంకట్ రెడ్డి, మేనేజర్ శివ కుమార్ వారి సిబ్బందితో కలిసి బస్తీలో పర్యటించారు. కలుషిత నీటిని పరిశీలించారు.
మంచినీటిలో మురికి నీరు కలవడంతో, వాటిని ఉపయోగించిన వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని బస్తీవాసులు వాపోయారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… అరుంధతినగర్‌తో పాటు డివిజన్‌లోని అనేక ప్రాంతాల్లో ఇదే సమస్య తీవ్రతరంగా మారిందని, వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా జలమండలి అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడించి, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వినయ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, బస్తీవాసులు నరసమ్మ, మీన, లక్ష్మి, పద్మా, ప్రకాష్, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

