స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు టికెట్లు ఇవ్వని పార్టీలను బొంద పెడుతాం
– వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్తా

హైదరాబాద్, సెప్టెంబర్ 09, అద్దం న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు టికెట్లు ఇవ్వని పార్టీలను బొంద పెడుతామని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్తా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా సాధన దీక్ష మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జరిగింది. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ… వైశ్యులు పేరికే అగ్రవర్ణాలుగా సమాజంలో కీర్తింపబడుతున్నారని, కానీ రాజకీయంలో అస్పృశ్యులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేట్, మార్వాడి వ్యాపారాల వల్ల పేద వైశ్యుల వ్యాపారాలు నిర్వీర్యం అయిపోతున్నాయని అన్నారు. వైశ్యులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో వైశ్యుల జనాభా శాతాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణతోనే పేద వైశ్యు విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైశ్యుల జనాభా దామాషా ప్రకారం 500 సర్పంచులు, 250 ఎంపీటీసీ, 30 ఎంపీపీ, 30 జెడ్పిటిసి, 200 కౌన్సిలర్లు, 40 కార్పొరేటరులు, కనీసం ఒక జడ్పీ చైర్మన్, ఒక మేయర్, 15 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు అవకాశం కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఆర్యవైశ్య కార్పోరేటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన నిధులు కేటాయించలేకపోవడంతో నిరుపేద ఆర్య వైశ్యులకు న్యాయం జరగడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో కూడా వైశ్యుల జనాభా ప్రకారం వాటా కేటాయించాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply