Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadహైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :   హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లోని కొత్తబజార్ నుంచి ముగ్గుబస్తీ, సాయిటవర్స్ వరకు నిర్మించ తలపెట్టిన రూ.63.50లక్షల నిధులతో డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కవాడిగూడ కొత్త బజార్ నుంచి ముగ్గుబస్తీ, సాయిటవర్స్ వరకు స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యను పరిష్కరించేందుకు నిధులు కేటాయించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. జనాభాకు అనుగుణంగా తాగునీటి పైప్‌లైన్ ఆధునికీకరణతో పాటు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

         ఎంఎల్ఏ ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… కవాడిగూడ మెయిన్ రోడ్ నుంచి ముగ్గుబస్తీ వరకు కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ నూతన పైప్‌లైన్ నిర్మాణంతో సమస్య పరిష్కారం కానుందని అన్నారు.

        ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ నారాయణగూడ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కవాడిగూడ ఇన్చార్జి సెక్షన్ మేనేజర్ శ్రీధర్, తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఏఎస్ఓ కృష్ణవేణి, డీటీ సదానంద్, మునిసిపల్ ఏఈ, వినోద్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి, రాష్ట్ర నాయకులు జి.వెంకటేష్, పరిమళ్ కుమార్, నాయకులు బిజెపి నాయకులు చారి, మహేందర్ బాబు, కేశవరాజు, రమేష్, బీఆర్ఎస్ డివిజన్ నాయకుకు శ్యామ్, నగర నాయకులు రాజేష్, శ్రీనివాస్, రవియాదవ్, రాజ్, మాధవి, కాంగ్రెస్ ఎ బ్లాక్ అధ్యక్షుడు విడి కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు పోతరాజు భాస్కర్ పాల్గొన్నారు.

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page