Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadఅరుంధతినగర్ బస్తీలో స‌మ‌స్య‌ల‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అరుంధతినగర్ బస్తీలో స‌మ‌స్య‌ల‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ద్దం న్యూస్ :   అరుంధతినగర్ బస్తీవాసుల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులు, డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్ వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్, వాటర్ వర్క్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ శంకర్,  జగన్ వారి సిబ్బందితో కలిసి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అరుంధతినగర్ బ‌స్తీలో గురువారం పర్యటించారు.  బస్తీలో మంచినీటి సరఫరాలో పైప్‌లైన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, మంచినీటి లీకేజి, లో ప్రెష‌ర్ సమస్య, వరదనీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామ‌ని బ‌స్తీవాసులు కార్పొరేట‌ర్‌తో వాపోయారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ మాట్లాడుతూ… దెబ్బతిన్న పైప్‌లైన్‌ స్థానంలో నూతన మంచినీటి పైప్‌లైన్‌ మంజూరు చేయించామని.. త్వరలో పనులు ప్రారంభించి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టనున్నామ‌ని తెలిపారు.

నూతన రోడ్డు నిర్మాణంతో స్థానికుల ఇళ్లలోకి చేరుతున్న వరద నీటి సమస్యను పరిష్కరిస్తామని వివరించారు. ఈ ప్రక్రియలో నిధులు మంజూరు కాగా ఇది వరకే మూడు సార్లు టెండర్ ప్రక్రియ రద్దుకావడంతో తాను ప్రత్యేక చొరవతో టెండర్ పనులను పూర్తి చేయించామ‌న్నారు. పనులను త్వరలో ప్రారంభిస్తామని కార్పొరేటర్ పావ‌ని బ‌స్తీవాసుల‌కు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్‌ కుమార్, సీనియర్ నాయకులు ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, డి.కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, బ‌స్తీవాసులు చిప్స్ రాజు, ఎల్లయ్య, ఆరోగ్యం, లక్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page