Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadటిఆర్‌టిలో మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం – మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

టిఆర్‌టిలో మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం – మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

📰 Generate e-Paper Clip

టిఆర్‌టిలో మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరిస్తాం
మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

ముషీరాబాద్, ఫిబ్రవరి 16, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ టిఆర్‌టి కాల‌నీలో మంచినీటి స‌ర‌ఫ‌రాలో లో ప్రెష‌ర్ స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని అన్నారు. సోమ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ టిఆర్‌టి కాల‌నీ కమ్యూనిటీహాల్ వీధిలో మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ప‌ర్య‌టించారు. గత ఆరు నెలలుగా టిఆర్‌టి ప్రజలు మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. వాటర్ వర్క్స్ ఇన్‌స్పెక్ట‌ర్ శంకర్ అక్కడికి చేరుకొని సమస్య వివరాలను తెలుసుకున్నారు. త్వరలో టిఆర్‌టి వాసుల మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌గా పదవీ కాలం పూర్తైన, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటాం అని మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు నవీన్, సీనియర్ నేతలు శ్రీకాంత్, దామోదర్, మురళీ, స్థానిక టిఆర్‌టి వాసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page