శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీ వాసులకు ఇళ్లను కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్టర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :       శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు అతి త్వరలో ఇళ్లను కేటాయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు డాక్టర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ శ్రీ స్వామి వివేకానంద‌న‌గ‌ర్ బ‌స్తీలోని 19 పేద ద‌ళిత కుటుంబాల ఇళ్ల‌ను కూల్చివేసి 15 నెల‌లు కావొస్తున్నా త‌మ‌కు పున‌రావాసం క‌ల్పించ‌డంలేద‌ని, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను కేటాయిస్తామ‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వ అధికారులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో బ‌స్తీవాసులు సోమ‌వారం రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మ‌ణ్‌ను బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ స్పందించి హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ అనిరుద్ దురిశెట్టి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ల‌కు ఫోన్లు చేసి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… నిరుపేద దళిత కుటుంబాలు ఇళ్లు కోల్పోయి గత 15 నెలలుగా నిరాశ్రయులుగా జీవిస్తున్నారని, కూల్చిన వెంటనే ఇళ్లు కేటాయిస్థామన్న ప్రభుత్వ అధికారులు ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు ఇళ్లు కేటాయించలేదని ప్రశ్నించారు.పేదలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, కలెక్టర్ అతి త్వరలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు లక్ష్మణ్ బస్తి వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బ‌స్తీ వాసులు ఎంబి.కృష్ణ, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, ఇందు, పద్మావతి, పూజరేఖ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page