తెలంగాణలో టిడిపిని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చుతాం
» స్పష్టం చేసిన టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు
హైదరాబాద్, జూలై 6, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీని తెలంగాణా క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు, రాబోయే రోజుల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చుతామని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో సోమవారం సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు శ్రీపతి సతీష్, పోలపల్లి అశోక్ లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సమాయత్తం కొరకు పార్టీలో నాయకులందరు సమిష్టిగా పని చేస్తూ డివిజన్ స్థాయిలో పార్టీని గట్టిగా బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, దానిలో భాగంగా ఈ నెల 9 వ తేదిన ప్రారంభం కానున్న “తెలుగుదేశం – ప్రజాపథం” కార్యక్రమంలో మొదటగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద నిర్వహించడం జరుగుతుందన్నారు.
టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… మొదట క్షేత్రస్థాయిలో ప్రతి డివిజన్ నుండి కనీసం 50 నుండి 100 మంది యాక్టివ్ కేడర్‌ను సిద్ధం చేస్తూ, అక్కడి స్థానిక సమస్యలపై పొరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇదే ప్రకారం రెండు రోజులకు ఒక్కో డివిజన్ ప్రకారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 38 డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ పొత్తు కుదిరితే, రాష్ట్రంలో పార్టీని నెంబర్ అగ్రస్థానంలో నిలబెట్టవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి వారం స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి డివిజన్‌లో తిరుగుతూ ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేయాలని పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు ఎంకె.బోసు, కాసుల సుదర్శన్ రెడ్డి, ప్రమీల, తడక వినోద్, శ్యామ్ సుందర్, పరుశు రామ్, భాను ప్రకాష్, ఎం.రాజు పి.బాలకృష్ణ, చంద్రమోహన్ గౌడ్, సి.విఠ్ఠల్, భవాని శ్రీనివాస్, గండికోట విజయ్, మల్లిఖార్జున్, సత్యనారాయణ, బి.రాజు, రవి, సత్తన్న, అనిల్, ఎస్.ప్రకాష్, యాదగిరి, శక్తి ప్రేమ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply