ఉద్యమకారుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

కరీంనగర్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : ఉద్యమకారుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి జిల్లా సమావేశం జరిగింది. జేఏసి రాష్ట్ర అధికార ప్రతినిధి బి.వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల జేఏసి కరీంనగర్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బండ గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మారుతి నేతకాని తదితరులను నియమించారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply