కాంగ్రెస్ పాల‌న‌లో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల‌కు దుస్థితి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 14, అద్దం న్యూస్ :    అమలుకాని అబద్దపు హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండేళ్ల కాలంలో చేసిందేమి లేదని, గురుకుల విద్యాలయ, స్థానిక సంక్షేమ హాస్టల దుస్థితి గురుకుల పాఠశాల దుస్థితికి కాంగ్రెస్ పాలన అద్దం పడుతుందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ఈ నెల 13వ తేదీ ( గురువారం ) సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్టర్ కళాశాల వసతి గృహంలో కాపలాదారు మద్యం మత్తులో అన్నం వండిన పాత్రలో కాలుపెట్టి నిద్రించిన ఘటన నిదర్శనమని అన్నారు. ఇంత నీచంగా దిగజారిపోయి వార్డెనే వాళ్ళ ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా విచారకరమ‌న్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… 1982లో మాజీముఖ్యమంత్రి దివంగ‌త ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి అణగారిన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన, హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలకు విద్యా బుద్దులు నేర్పించాలనే సదుద్దేశ్యంతో మహోన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన విద్యాలయాల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పాలనలో దయనీయంగా తయారైందని సాయిబాబా అన్నారు.

                    గురుకుల విద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి కృషి చేయాలని అన్నారు. కంటిలో నలక పడిందని కంటి తీసేస్థాననే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని గురుకుల విద్యాలయాలు ప్రైవేటు భవనాలకు కొనసాగుతున్న వాటి అద్దె కూడా చెల్లించలేదని, ఆ గురుకుల భవనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమ‌న్నారు. గతంలో గురుకుల పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమ‌ర్శించారు. ఇదేనా ఇందిరమ్మ పాలన ఇదేనా కాంగ్రెస్ పాలనకు సంకేతమా అని ప్రశ్నించారు. ఈ విధంగా ఒక పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన సంఘటన అని అన్నారు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి గురుకుల పాఠశాలల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో భోజన వ్యవస్థను పరిశీలించి పర్యవేక్షించాలని అన్నారు.

                      కేవలం ఎలక్షన్‌లో దృష్టిపెట్టి గెలిచామని చెప్పి సంకలు బాదుకోవడం కాదు ముందున్నది ముసళ్ల పండుగ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలిచారు… ప్రజలు మీవైపే ఉన్నారు కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజంగా మీకు నిజాయితీ, చిత్తశుద్ది, ధైర్యం వుంటో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రుజువు చేసుకోవాలని సాయిబాబా సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page