Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadవ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...

వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

📰 Generate e-Paper Clip

వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే ప్ర‌జా ప్ర‌తినిధులు ఏమ‌య్యారు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ :   ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో రోడ్లు గుంతలుగా తయారై రవాణా వ్యవస్థ, ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నా కనీసం పాలన యంత్రాంగం గానీ.. ప్రతిపక్ష నాయకులు గానీ, కార్పొరేటర్లు గాని.. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలను తిన్నారా లేదా అని పరామర్శించి ధైర్యం చెప్పే వారు ఎవరు ముందుకు రాకపోవడం దౌర్భాగ్యకరమైన విషయమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ…గోరు చుట్టు రోకటి పోటు మాదిరిగా జిహెచ్ఎంసి నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి హైడ్రాకు కట్టబెట్టడంతో జిహెచ్ఎంసి – హైడ్రాల మధ్య సమన్వయలోపం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయ‌న్నారు. కనీసం ఈ వర్షాల వల్ల చేపట్టాల్సిన అత్యవసర పనులు కూడా వీరు చేస్తారని వారు, వారు పోతారని వీరు, ఇద్దరూ పట్టించుకోకుండా ప్రజల భారం గాలికొదిలేసారని, ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ చివరికి ప్రజల్ని అవస్థలకు గురి చేశారన్నారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలో బాధ్యత రహితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని సాయిబాబా విమర్శించారు. నగరానికి ఇన్చార్జ్ మంత్రి తన కూతురు పెళ్లి అంటూ సమయం ఇవ్వలేకపోతున్నారని, గతంలో కాంగ్రెస్ వైఖరి తెలిసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క సీటు కూడా గెలిపించ లేదన్నారు. నగర ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే నగరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని సాయిబాబా అన్నారు. కాబట్టి ప్రభుత్వం మేల్కొని సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజుగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page