వితంతువు, వృద్ధాప్య పింఛన్ల పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయ‌రా ? – బిఆర్ఎస్ రాంన‌గ‌ర్ మ‌హిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  టిఎంఎస్ఎస్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ ఎస్‌.క‌ల్ప‌న

వితంతువు, వృద్ధాప్య పింఛన్ల పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయ‌రా ?
– బిఆర్ఎస్ రాంన‌గ‌ర్ మ‌హిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  టిఎంఎస్ఎస్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ ఎస్‌.క‌ల్ప‌న

హైదరాబాద్, డిసెంబ‌ర్ 2, అద్దం న్యూస్ :      కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వితంతువు, వృద్దాప్య పింఛన్ల కోసం పేద ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని, కానీ ద‌ర‌ఖాస్తులు చేసుకుందామ‌నుకుంటే అందుకు సంబంధించిన పోర్ట‌ల్ ఓపెన్ కావ‌డంలేద‌ని బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మ‌హిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ ఎస్‌.క‌ల్ప‌న అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆమె “ అద్దం న్యూస్ ” ప్ర‌తినిధితో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వృద్ధాప్య పింఛన్‌ను రూ. 4,000కి పెంచుతామని హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ పెంపు అమలు కాకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. పేద ప్ర‌జ‌లు అర్హులుగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వితంతువు, వృద్ధాప్య, ఆసరా పింఛన్లను మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని విమ‌ర్శించారు. గ‌తంలో బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం వృద్ధులు, వితంతువులకు రూ. 2,016 రూపాయ‌ల పింఛ‌న్ల‌ను ఇచ్చింద‌న్నారు. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని పెంచుతామన్న హామీని ఇంకా పూర్తిగా అమలు చేయలేదని క‌ల్ప‌న ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ద్వారా పేద‌ల‌కు గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇళ్ల‌ను ఇచ్చింద‌న్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇందిరమ్మ ఇళ్ళ ప‌థ‌కాన్ని ప్రారంభించిందని, కానీ ఒక్క‌రికి ఇళ్లు ఇవ్వ‌లేద‌న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇస్తున్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌న్ని గ‌తంలో బిఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో నిర్మించిన‌వే అని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. వెంట‌నే వితంతువు, వృద్ధాప్య, ఆస‌రా పింఛ‌న్ల పోర్ట‌ల్‌ను ఓపెన్ చేయాల‌ని, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను అర్హుల‌కు ఇవ్వాల‌ని, రుణాల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని క‌ల్ప‌న‌ డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page