
జగిత్యాల, జూన్ 18, అద్దం న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగిత్యాల శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులలంతా ఐక్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా ప్రయత్నం చేయాలని అన్నారు. బుధవారం జగిత్యాలలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జగిత్యాల జిల్లా తృతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు సంజయ్ కుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మాట వాస్తవమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. జర్నలిస్టులలో ఐక్యత లోపం ఉందని, ఐఎంఏ లాగా జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జడ్పీ మాజీ ఛైర్మన్ దావా వసంత సురేష్, మున్సిపల్ తాజా మాజీ ఛైర్ పర్సన్ అలవాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, ఇటు యాజమాన్యాలు, అటు ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని మామిడి సోమయ్య కోరారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లాల జైపాల్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మాజీ జెడ్పీటీసీ మహేష్, బీఆర్ఎస్ నాయకురాలు అనురాధ, సింగిల్ విండో ఛైర్మన్ మహిపాల్ రెడ్డి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్యామ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనందం, విజయ్ కుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవ రాజు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు బాపురావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఫెడరేషన్ సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఇటీవల మరణించిన పలువురు జర్నలిస్టులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జగిత్యాల జిల్లా తృతీయ మహాసభ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ద్యావర సంజీవ రాజు, కార్యదర్శిగా మేన్నేని రవీందర్రావు, కోశాధికారిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా రాగం రమేష్, పిప్పరి శ్రీనివాస్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా లింగారెడ్డి, సంయుక్త కార్యదర్శిలుగా అన్వేష్, జీవన్, శ్రీనివాస్, కాంతారావు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణ కుమార్, చింత గంగాధర్, రాజలింగం, చింత రోజా, లావణ్య, రాజేశం, మహమ్మద్, శ్రీధర్, వేణుమాధవ్, ఎండి.ఆజం, నరేంద్ర రావు, శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply