మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి – జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :    ప్రతి మహిళా స్వయం కృషితో ఆర్థిక ప్రగతి సాధించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈనెల 27వ తేదీన నగరంలోని నోవోటెల్ లో జరగనున్న డైనమిక్ ఎంటర్ పెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్ ( దేవి ) సంస్థ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ ఎంటర్ పెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్ గౌరవ చైర్ పర్సన్ మడిపడిగె సత్యవతి ప్రసన్న, చైర్ పర్సన్ డాక్టర్ వేముల నీలిమ, వైస్ చైర్మన్ డాక్టర్ గుడుగుంట్ల కల్యాణి, చీఫ్ అడ్వయిజర్ మడిపడిగె రాజు, పల్లవి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page