హెచ్ఎంఎటిలో న్యాపతి శ్రీనివాస్ రావు స్మారక ప్రసంగం పై వర్క్ షాప్

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :  హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( హెచ్ఎంఎటి ) ఆధ్వ‌ర్యంలో స్వాస్థ్యకళా నికేతన్ (ఆంత్రో పోసోఫిక్ మెడిసిన్ స్వాస్థ్యనికేతన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ యూనిట్ ) బెంగళూరు సౌజన్యంతో కళ ఒక ఔషధం చికిత్సా విధానం పై న్యాపతి వెంకట శ్రీనివాస్ రావు స్మారక ప్రసంగం పురస్కరించుకొని ఒక్క రోజు వర్క్ షాప్‌ను శుక్ర‌వారం జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆర్ట్, కాంప్లిమెంటరీ ఇంటిగ్రేటెడ్ థెరపిస్ట్ డా.వాహిదా మూర్తి, శిల్పిక తురాకియా హైదరాబాద్‌తో కలిసి ఆర్ట్‌తో చికిత్స పై వర్క్ షాపును నిర్వహించారు. కళ ఒక ఔషధం ఎందుకు ? కళ చికిత్సలో అంతర్భాగం, కళ శారీరక, మానసిక రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతుంది ? కళలో లోతైన వైద్య శక్తులు దాగి ఉన్నాయని ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఈ సంద‌ర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.గోపాలకృష్ణ మాట్లాడుతూ… రామకృష్ణ ఫార్మాస్యూటికల్ అధినేత, గొప్ప హోమియోపతి అభిమాని, దివంగత న్యాపతి వెంకట శ్రీనివాస్ రావు పేర నిర్వహించే స్మారక ఉపన్యాసంలో ‘ ఆర్ట్ ఈజ్ మెడిసిన్ ‘ అనే అంశం పై వైవిధ్యమైన వర్క్ షాప్‌ను నిర్వహించడం విశేషమని తెలిపారు. ఎన్.వి.శ్రీనివాస్ రావు ఆంధ్రప్రదేశ్‌లో హోమియోపతి వైద్యాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేసిన మార్గదర్శకుల్లో ప్రముఖుడని ప్రశంసించారు.

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్‌.జి.దుర్గాప్రసాద్ రావు మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా నిరంతరం తాము నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సహకరిస్తున్నవారందరికి ధన్యవాదములు తెలిపారు. ఈ వర్క్ షాప్‌లో జెఎస్‌పిఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల, హంస హోమియోపతి కళాశాలల పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌.ఎవి.రాజేశ్వర్ రావు, ప్రొఫెసర్ డాక్ట‌ర్‌.లగ్నజిత రావి పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ప్రత్యేక అతిథి హోమియో అదనపు సంచాలకులు, జిఎస్‌పిఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌.ఎన్.లింగరాజు హాజరయ్యి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ సుధ ఎన్ శ్రీనివాస్ రావు, అసోసియేషన్ టెక్నికల్ అడ్వైసర్ డాక్ట‌ర్‌.సివి.స్వామి, ఐసిఆర్.హెచ్ క్లినికల్ డైరెక్టర్ డాక్ట‌ర్‌.వేణు గోపాల్ గౌరి, ఉపాధ్యక్షురాలు డా.రాజేశ్రీ పై.షా, ఆర్గనైజింగ్ కార్యదర్శి డా.గౌతమ్ రాళ్ళబండి, సహాయ కార్యదర్శి డా.ఆర్.శృతి , మెంబర్ డా.పి.శ్రీనివాస్, క్రేనియో సాక్రల్ థెరపిస్ట్ కేతన్, సీనియర్ హోమియో ప్రాక్టీషనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page