Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadటిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు

📰 Generate e-Paper Clip

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు 

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ : 

తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో వినాయకునికి ఘనంగా ప్రత్యేక పూజలు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా హాజ‌ర‌య్యారు. ఈ సందర్బంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… ఎన్‌టిఆర్ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ విద్యా, వైద్య, రవాణా, వ్యవసాయం, సంక్షేమ, అభివృద్ధి రంగాలలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు. పారిశ్రామికీకరణకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు దేశ విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టి లక్షలాది యువత ఉపాధికి దోహదపడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు విద్యను ఒక యజ్ఞంలా నిర్వహించారని తెలిపారు. ఐటీని అభివృద్ధి చేయడంలో, హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, బి.రాజు, రవి, యాదగిరి, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page