
హైదరాబాద్, నవంబర్ 14, అద్దం న్యూస్ : టిజిఎస్ ఆర్టీసి ప్రవేశపెట్టిన యాత్రా దానం కార్యక్రమంలో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా కెడిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ( నాగర్ కర్నూల్ ) వారు కె.దక్షిణా మూర్తి జ్ఞాపకార్థం ముషీరాబాద్ ఆర్టీసి డిపో సహకారంతో యాత్రా దానానికి తరలివెళ్లారు. ఇందులో భాగంగా అమితాభి ఆదరణ విద్యాలయ విద్యార్థులను శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి దేవాలయం సందర్శనకు తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రా దానం అవకాశం కల్పించిన కెడిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి టిజిఎస్ ఆర్టీసి తరపున అమితాభి ఆదరణ విద్యాలయ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు డిపో మేనేజర్ రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply