ముషీరాబాద్ డిపో ఆధ్వ‌ర్యంలో యాత్రా దానం –  ఎడ్యుకేట‌ర్స్ ద ఆర్కిటెక్స్ ఆఫ్ ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్‌కు విద్యార్థుల‌ను తీసుకెళ్లిన ఆర్టీసి

గచ్చిబౌలి, నవంబర్ 22, అద్దం న్యూస్ :   టిజిఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన యాత్రా దానం కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మకుమారిస్ సేవా సంస్థ వారు శాంతి సరోవర్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఎడ్యుకేటర్స్ ద ఆర్కిటెక్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ( విద్యావేత్తలు రేపటి భవిష్యత్ తరానికి నిర్మాతలు ) అనే కార్యక్రమానికి ఆంధ్ర మహిళా సభ బీఈడీ స్టూడెంట్స్ ను ముషీరాబాద్ డిపో ఆధ్వ‌ర్యంలో తీసుకెళ్లారు. కాలేజీ నుండి గచ్చిబౌలి శాంతి సరోవర్ వరకు రవాణా సదుపాయం కల్పించడానికి కెడిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు యాత్రా దానం చేసే అవకాశాన్ని ముషీరాబాద్ డిపోకి కల్పించారు. గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ముషీరాబాద్ డిపోకి యాత్రా దానం అవకాశం కల్పించినటువంటి కెడిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, బ్రహ్మకుమారి సేవా సంస్థ వారికి డిపో మేనేజర్ టి.రఘు టీజిఎస్ ఆర్టీసీ సంస్థ తరఫున, ముషీరాబాద్ డిపో తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా సభ బీఈడీ విద్యార్థులు, ముషీరాబాద్ డిపో అధికారులు, ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page