...

గాంధీనగర్ డివిజన్‌లో యోగా కార్య‌క్ర‌మం

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ :     అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ ప్రాంగణంలో బుధ‌వారం యోగా కార్య‌క్ర‌మం జ‌రిగింది. బిజెపి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు న‌వీన్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ నాయకులతో కలిసి యోగ ఆసనాలు వేశారు. యోగ మాస్టర్ డివైన్ పవర్ యోగా సెంటర్ స్థాపకులు ఎన్.దీనన్ శిక్షణలో నాయకులు యోగ చేశారు. ఈ సందర్భంగా ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 21 న లాల్ బహదూర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారని తెలిపారు. ఆ కార్య‌క్ర‌మానికి గాంధీనగర్ డివిజన్ నుండి యువకులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి రాజు, సత్తి రెడ్డి, పాల శ్రీను, ప్రకాష్ యాదవ్, సత్యేంధర్, చిర్ర యాదగిరి, సుక్క యాదగిరి, నీరజ్, సంయుక్త రాణి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.