కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ :   మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన యువతిని సుష్మ (27)గా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వివ‌రాల్లోకి వెళ్లితే… సికింద్రాబాద్‌ అడ్డగుట్టకు చెందిన అంజ‌య్య కూతురు సుష్మ ( 27 ) బుధ‌వారం హైటెక్ సిటీలోని (DIEBOLD/NIXDORF) కార్యాల‌యానికి ప‌ని నిమిత్తం వెళ్లింది. రాత్రి అయినా సుష్మ ఇంటికి రాలేద‌ని బెంగ‌ప‌డ్డ తండ్రి అంజ‌య్య (DIEBOLD/NIXDORF) ఆఫీస్ మేనేజ‌ర్‌కు ఫోన్ చేశాడు. రాత్రి 10:30 గంట‌ల‌కే కార్యాల‌యం నుంచి సుష్మ వెళ్లిపోయింద‌ని మేనేజ‌ర్ చెప్పాడు. దీంతో తెల్ల‌వారుజాము వ‌ర‌కు ఎదురు చూసిన‌ప్ప‌టికి సుష్మ ఇంటికి రాక‌పోవ‌డంతో అంజ‌య్య గురువారం తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. గురువారం ఉద‌యం 7 గంట‌లకు దుర్గం చెరువులో మృతదేహం తేలియాడుతోందని పోలీసులకు సమాచారం వ‌చ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చూడ‌గా ఓ మ‌హిళ మృత‌దేహం క‌నిపించింది. ఆ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీయించిన త‌ర్వాత ప‌రిశీలించ‌గా మృతదేహం సుష్మ దిగా పోలీసులు గుర్తించారు. విష‌యాన్ని సుష్మ కుటుంబసభ్యులకు పోలీసులు తెలియ‌చేశారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుష్మ ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవ‌రైనా హ‌త్య చేసి చెరువులో ప‌డేసారా ? అనే కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఒక‌వేళ సుష్మ‌ ఆత్మ‌హ‌త్య చేసుకుంటే అందుకు గల కారణాలు తెలియాల్సి ఉందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page