జనరంజని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గిడియోన్ బాబు ఆధ్వర్యంలో యూత్ మేళా
– మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, ఆగస్టు 11, అద్దం న్యూస్ : జనరంజని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గిడియోన్ బాబు ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని ఎంబి చర్చిలో యూత్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై యూత్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చదువులు పుర్తయిన విద్యార్థులు నిత్యం కొత్త ఆంశాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యూత్ మేళాను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, యూత్ మేళాలను వంటి ఆవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, రెవరెండ్ గుమ్మడి జోవెల్, బిషప్ డాక్టర్ శామ్యూల్ జాన్, డాక్టర్ సామ్ అబ్రహం, కమిటీ సభ్యులు కృపాకర్, మధు తదితరలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply