Friday, September 18, 2026
HomeHyderabadయువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి – సినీ న‌టుడు డాక్టర్ మదాల రవి

యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి – సినీ న‌టుడు డాక్టర్ మదాల రవి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాల‌ని సినీ న‌టుడు డాక్టర్ మదాల రవి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో షహీద్ భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా యువజన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సినీ న‌టుడు హీరో డాక్టర్ మదాల రవి, ఎస్‌వికె కార్య‌ద‌ర్శి ఎస్.వినయ్ కుమార్ డాక్టర్ విజయెందర్ లుహాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం స్వేచ్చా స్వాతంత్య్రం కోసం ఇరవై మూడేళ్ళ వయసులో ప్రాణాలర్పించిన గొప్ప విప్లవ వీర కిషోరాలు అని అన్నారు. నేటి విద్యార్థి యువత స్వాతంత్య్ర ఉద్యమ పోరాటస్ఫూర్తితో తమ హక్కుల కోసం గళం వినిపించాలని ఉన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా కావాలని అన్నారు. ఈ రోజు రక్త హీనత బాధపడుతూ అనేకమంది మృత్యువాత పడుతున్నారని… బాధ్యత గల విద్యార్థి యువజన సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విస్తృతంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, అనగంటి వెంకటేష్, ఐపిఎం బ్లడ్ బ్యాంక్ డాక్టర్స్ మాధ‌వి, శశిదర్, జెకే.శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, జావీద్, నాగేందర్, ప్రశాంత్, రాజయ్య, శ్రీనివాస్, అస్మిత, రమ్య, ప్రజా సంఘాల నాయకులు మహేందర్, విజయ్ కుమార్, అజయ్ బాబు, కిరణ్, శ్రీనివాస్, దశరథ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page