యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాలి – నేష‌నల్ పీపుల్స్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే 

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాలి
– నేష‌నల్ పీపుల్స్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే 

అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే దేశానికే ప్ర‌మాద‌క‌రం
– నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ కో–ఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ : యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాల‌ని నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పిపి ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే అన్నారు. నేష‌న్ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పిపి ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే, నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పిపి ) జాతీయ యువ‌జ‌న అధ్య‌క్షుడు నిక్కీ నాన్గహలా బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. వారికి నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ కో–ఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ ఆధ్వ‌ర్యంలో పార్టీ నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పూల‌మాల‌లు, సాంప్ర‌దాయ డ‌ప్పు చ‌ప్పుల్లతో వారికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పిపి ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే మాట్లాడుతూ…. అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే ఈ దేశానికి ప్ర‌మాద‌క‌రమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్ర‌గ‌తి కోసం పాటుప‌డే ప్ర‌తి యువ‌తీ యువ‌కుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేయాల‌ని సూచించారు. మహనీయుడు పిఎ.సంగ్మా సేవలను స్మరించడానికి మనమందమున్నార‌ని తెలిపారు. ఆయన గిరిజనులకైనా, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాన్నే అంకితం చేశార‌న్నారు. వాస్త‌వానికి ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమ‌ని, మన సమాజంలోని ప్రతి వ్యక్తి గౌరవంగా, న్యాయమైన హక్కుల కోసం నిలబడే రోజు అని గుర్తు చేశారు.

                          నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కో–ఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ మాట్లాడుతూ… బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన తాను నేడు ఇక్కడ నిలబడి, మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతతో మాట్లాడటం త‌న‌కెంతో గర్వంగా ఉంద‌న్నారు. యావత్ దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా పిఎ.సంగ్మా జాతీయ స్థాయిలో ఎదిగార‌ని, అటువంటి మ‌హ‌నీయుడు పెట్టిన పార్టీకి తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయ‌క‌త్వం వ‌హించ‌డం హ‌ర్ష‌ణీయం అన్నారు. యువతను భవిష్యత్తు నాయకులుగా కాకుండా కేవలం ఓటు బ్యాంక్‌గానే దేశంలోని అన్ని పార్టీలు చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యా, వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ, ఉద్యోగులకు సమయానికి రిటైర్మెంట్, ఆరోగ్య ప్రయోజనాలు, అంగ‌న్‌వాడీ, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ భద్రత, పోలీసులకు సముచిత పని గంటలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మనకి ఒక గొప్ప నాయకుడుగా మేఘలయ సీఎం సంగ్మా దొరికార‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నేష‌నల్‌ పీపుల్స్ పార్టీకి చెందిన వివిధ జిల్లాల నుంచి నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page