దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి

నేరెడ్‌మెట్‌లో జరిగిన తిరంగా ర్యాలీ దృశ్యం.
నేరెడ్‌మెట్, మే 23, అద్దం న్యూస్ : దేశ సమైక్యతకు ప్రతి ఒక్క కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బీజేపీ మల్కాజ్‌గి అసెంబ్లీ సెగ్మెంట్ సారథ్యంలో నేరెడ్‌మెట్ చౌరస్తా నుండి మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహ వేదిక వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మేజర్ జనరల్ శ్రీనివాస్ , ఆర్మీ రవి , సైనికులు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సి రాంచందర్ రావు, బీజేపీ తెలంగాణ సంస్థా గత ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి, రాష్ట్ర మహిళా మోర్చా లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న, పంకజ శ్రీనివాసన్ తదితరులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం సుస్థిరంగా ఉంటుందన్నారు. దేశ సైనికులకు మద్దతుగా సంఘీభావ తెలపాలని పిలుపునిచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply