గ్రేటర్లో సొంత ఇల్లులేని పేదలకు 100 గజాల స్థలం ఇవ్వాలి
♦ ఈ నెల 28న తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా
హైదరాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్‌లో సొంత ఇల్లులేని పేదలకు 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నాను ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్నట్లు తెలంగాణ గుడిసెవాసుల సంఘం ( టిజివిఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు బాకి రవి, ఎమ్మార్పీఎస్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ బిఎన్.రమేష్ కుమార్ మాదిగ లు తెలిపారు. ఈ మేరకు ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది పేద ప్రజలకు సొంత ఇళ్లులేక.. చాలీ చాలని వసతులతో అద్దె ఇండ్లల్లో నివసిస్తూ ఇబ్బందులుపడుతున్నారన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తే ఇల్లులేని పేదలకు ఇంటి పట్టాలు 1999 నుంచి 2004 వరకు తట్టి అన్నారం, సూరారం, న్యూ హఫీజ్‌పేట, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది పేదలకు పట్టాలు వచ్చాయన్నారు. ప్రజాపాలన గురించి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 18 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి ఇందిరామ్మ ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మందికి పైగా పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ప్రజలున్నారన్నారు. వారిలో సొంత ఇల్లులేక అనేక ఇబ్బందులుపడుతున్నారని, వారందరూ తమకు సొంత ఇల్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఇందిరామ్మ రాజ్యాం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే ఈ రోజు రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు దగా చేస్తూ పొట్టలు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 28వ తేదీన జరుగనున్న భారీ ధర్నాకు ముఖ్య అతిథులుగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ముషీరాబాద్, అంబర్‌పేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ ధర్నాకు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు ములుగు నవీన్, పార్టీ చిన్నబాబు, పవన్ కుమార్, ఉపేందర్, నరసింహులు, సోమారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply