Friday, October 30, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరాఫరకు చర్యలు

అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరాఫరకు చర్యలు

📰 Generate e-Paper Clip

కాచిగూడ, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :

అంతరాయం లేకుండా వినియోగదారులకు విద్యుత్ను అందించనున్నట్లు గోల్నాక సెక్షన్ ఎలక్ట్రికల్ ఏఈ కె.భాస్కర్ అన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా గురువారం గోల్నాక సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని 500 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఏఈ కె.భాస్కర్ మాట్లాడుతూ… గోల్నాక సెక్షన్ పరిధిలోని వినియోగదారులకు కోతలు లేని విద్యుత్ను అందించడా నికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిజిఎం కరుణాకర్ బాబు, ఎస్ఈ రమేశ్, వినోద్కుమార్, శీనయ్య, శివకుమార్, రాజు, సంపత్, ప్రవీణ్ కుమార్, రాంప్రసాద్, వెంకన్న, లక్ష్మీపతి, వేణుగోపాల్, నర్సింగ‌రావు, జగన్, భోగ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. గోల్నాక సెక్షన్ పరిధిలో 24/7 ఎమర్జెన్సీ సమస్యలు తలెత్తితే 8712469928లో సంప్రదించాలని ఏఈ భాస్కర్ కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page