ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం

ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం

హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో వారు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. దోమ‌ల‌గూడ‌లోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాక ఆవిష్కరణ, ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు, కేక్ కటింగ్ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల పంపిణీ చేస్తార‌న్నారు.

అలాగే న‌గ‌రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో, డివిజ‌న్‌, ఏరియాల‌లో టిడిపి ప‌తాక ఆవిష్క‌ర‌ణ చేసి, ఎన్‌టిఆర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించి, స్వీట్ల పంపిణి, కేక్ కటింగ్ అన్నదానం, పండ్ల పంపిణీ, వంటి సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని న‌ల్లెల్ల కిషోర్‌, బాల్‌రాజ్ గౌడ్‌లు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు శ్యామ్ సుందర్, తడక వినోద్, కరణం కిరణ్, భానుప్రకాష్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page