ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు భూంపల్లి అశోక్ దాదా

ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి

– ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు భూంపల్లి అశోక్ దాదా



హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :   ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా డిమాండ్ చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించే వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాల‌న్నారు. వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని గ‌త ప్ర‌భుత్వం మాట ఇచ్చి మోసం చేసింద‌న్నారు. జ‌న్మ‌తః సారావృత్తి, మాంసం వృత్తి ఆరె క‌టిక‌ల‌దే అని అన్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల‌లో ఆరె క‌టిక‌లు అనేక అక్ర‌మ కేసుల‌పాల‌య్యార‌ని వాపోయారు. గ‌త ప్ర‌భుత్వం పిలుపుమేర‌కు నాటు సారా కాయ‌డం మానేసిన ఆరె క‌టిక‌ల‌కు నూత‌న ఎక్సైజ్ పాల‌సీ 2021లో ఎటువంటి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించలేద‌న్నారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైన ఆరె క‌టిక‌ల‌కు వైన్స్ టెండ‌ర్ల‌ల్లో 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి, ఆరె క‌టిక‌ల‌ను ఆదుకోవాల‌ని కోరారు. 500 కోట్ల నిధుల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. బిసి డి నుంచి బిసి ఎ హోదా క‌ల్పిస్తూ జిఓ తీసుకురావాల‌ని కోరారు. ఇంటిగ్రేటెడ్ మ‌ట‌న్ మార్కెట్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు పూర్తి హ‌క్కును క‌ల్పిస్తూ జిఓ తేవాల‌ని, మేక‌లు తేవ‌డానికిపోయి వ‌స్తున్న క్ర‌మంలో ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఆరె క‌టిక‌ల‌కు రూ.25 ల‌క్ష‌ల యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్‌ను వ‌ర్తింప‌చేయాల‌న్నారు. ఈ సమావేశంలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నాగ శేషు, కె.వెంకటేశ్వర్, జికె.నందీశ్వర్, కేడి దినేష్, జె.శ్రీనివాస్, జి.రమేష్, సరస్వతి భాయ్, అరుణ్ కుమార్‌, బాలకిషన్, పాలెం రమేష్, మహేందర్, జి.తుల్జారాం తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page