ఆర్.కృష్ణయ్య ఉద్యమాలతోనే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు
– బిసి యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రసిడెంట్ మార్క రమేష్ కుమార్ యాదవ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఉద్యమాలతోనే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించామని బిసి యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రసిడెంట్ మార్క రమేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆర్.క్రిష్ణయ్యను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందచేసి ఆయనను రమేష్ కుమార్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా బిసి యువజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రసిడెంట్ మార్క రమేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయడం హర్షనీయమన్నారు. ఇది యావత్ బీసీల విజయమని 1984 నుంచి నేటికీ దశల వారీగా రిజర్వేషన్లు పెరుగుతూ వచ్చాయని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మకమైనటువంటి విజయమని తెలిపారు. ఈ రిజర్వేషన్ల వలన బీసీలు అన్ని విధాలుగా సామాజిక న్యాయం పొందుతారన్నారు. ఇదంతా ఆర్.క్రిష్ణయ్య పోరాట ఫలితమే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిల్ల సతీష్, కార్యదర్శి రవి, బిసి నాయకురాలు రమ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply