యువత నెట్‌వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

అంబ‌ర్‌పేట్, అద్దం న్యూస్ : యువత నెట్‌వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు సూచించారు. ఎఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును న‌గ‌రంలో శ‌నివారంనాడిక్క‌డ‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామిక డేటా నైపుణ్య నిపుణుడు దేవాద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కోడ్‌బేసిక్స్ 800 మందికి పైగా యువతతో పాటు ఎఐ, డేటా నిపుణుడు దవాన్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏఐ డేటా సైన్స్, అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ప్లాట్‌ఫారమ్‌గా వర్క్‌షాప్‌లు దోహదప‌డుతాయన్నారు. సంక్లిష్ట విషయాలను సాపేక్ష, వాస్తవ ప్రపంచాన్ని సరళీకృతం చేయడానికి వీలుంటుందన్నారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా కనెక్ట్ కావడానికి ప్రత్యేక అవకాశాలను అందిస్తాయని వివరించారు. యువతకు అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. డేటా అనలిటిక్స్‌తో పాటు వివిధ రంగాలపై దాని పెరుగుతున్న ప్రభావాన్ని వివరించారు. ఏఐ డేటా ఫెస్ట్‌లో పాల్గొన్న యువతకు నెట్‌వర్క్ నైపుణ్యాలను తెలియజేశారు. నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన ప్రాజెక్టును వివరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page