అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Vijay-Rashmika) గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ జంట 2026 ఫిబ్రవరి 26న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం.
ఈ వివాహ (Vijay-Rashmika) వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం భారీ రిసెప్షన్ (Reception) ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, వీరిద్దరికీ 2025 అక్టోబర్‌లోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం కూడా జరిగిందట.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో ఆన్-స్క్రీన్ హిట్ పెయిర్‌గా (Vijay-Rashmika) నిలిచిన విజయ్-రష్మిక, నిజజీవితంలోనూ ఒక్కటి కాబోతుండటం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇటీవల రష్మిక ఈ వార్తలను ఖండించకపోవడం, సమయం వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్పడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. అయితే పెళ్లి వార్తలపై ఇరువురి నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
