...

ప‌ల్లిగింజ తిని చిన్నారి మృతి

 

రంగారెడ్డి, అద్దం న్యూస్ :    ప‌ల్లిగింజ తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ల‌ష్క‌ర్‌గూడ‌లో జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన శ్యామ్, మహేశ్వరి ల‌కు ఏకైక కూతురు తన్విక (4). ఇదిలా ఉండ‌గా ఈ నెల ఈ నెల 27వ తేదీన ఇంట్లో ఆడుకుంటూ ప‌ల్లీల‌ను తిన్న‌ది. ప‌ల్లిగింజ‌ తింటుండగా పొరపాటున లంగ్స్‌లో ఇర్రుక్కుపోయింది. దీంతో పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా ఆ చిన్నారిని త‌ల్లిదండ్రులు హైద‌రాబాద్ నీలోఫ‌ర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు పల్లిగింజ ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేద్దామనుకునే లోపే పరిస్థితి విషమించి సోమ‌వారం ఆ చిన్నారి మృతి చెందింది. ఈ మేర‌కు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.