Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి...

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :    సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి పాశం మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణ, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్ట‌ర్ల పర్య‌వేక్ష‌ణ‌ లేకపోవడం వలన జరిగిందని అర్థమవుతుందన్నారు. మరణించిన కార్మికులు, క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి, సెక్షన్ 304 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు ( కార్మికులు ) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page