Saturday, September 19, 2026
No menu items!
HomeEducationఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి
బీఆర్ఎస్‌కు ప‌ట్టిన గ‌తే కాంగ్రెస్‌కు ప‌డుతుంది
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ :   ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని, ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారని, ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి.. ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైద‌రాబాద్ జాగృతి కార్యాలయంలో మీడియాతో క‌విత మాట్లాడుతూ… ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు. బీఆర్ఎస్ ఇలాంటి విధానాన్ని ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ చేస్తే వారికి పట్టిన గతే వీరికి పడుతుందన్నారు. నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ లో ఫుడ్ సేప్టీ, టీచర్ల పీఎఫ్ లాంటి అంశాలపై రైడ్స్ చేయాలన్నారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. ఒకేసారి 30 శాతం నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని.. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 39, 641 స్కూల్స్ ఉంటే అందులో దాదాపుగా 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీటిలో 27, 581 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 12, 061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతుంటే 38 లక్షల మంది ప్రైవేట్‌లో చదువుతున్నారని, ప్రైవేట్‌లో మళ్లీ 350 స్కూల్స్ స్పెషలైజ్డ్‌గా ఉన్నాయని.. వాటిల్లో 3 లక్షల మంది చదువుతున్నారన్నారు.

 నారాయణ, చైతన్య లాంటి 12 వందల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 5 లక్షల మంది చదువుతున్నారని… మిగతా స్కూల్స్‌లో మిగిలిన విద్యార్థులు చదువుతున్నారన్నారు. 236 బడ్జెట్ స్కూల్స్ ఉంటే వాటిలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం 42 వేలు ఇస్తుంది ఇది మన రాష్ట్రంలోని స్కూల్ విద్యకు సంబంధించిన స్వరూపమ‌న్నారు. అయితే ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. లక్షా రూపాయలు ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30 వేలు బర్డెన్ కాబోతోందన్నారు. దీనిపై హైదరాబాద్‌లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారన్నారు. పైగా ఎవ్రీ మంత్ ఫీజు తీసుకోవాల్సింది పోయి ఒకేసారి 60 శాతం ఫీజు కట్టాలంటూ ఫోర్స్ చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ ఏటా 15 వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి కానీ.. రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. పైగా ధోభి, ఫుడ్, పుస్తకాలు ఇలా దేనికి కూడా మన వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదన్నారు. 2 వేల రూపాయల పుస్తకాలకు 15 వేలు వసూలు చేస్తున్నారని, నారాయణ, చైతన్య స్కూల్స్ వాళ్లకు ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయని తెలిపారు. ఈ విధానాన్ని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ కూడా అలానే చేస్తే వారికి పట్టిన గతే పడుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం మన ఖర్మ ఎన్నికల వరకు విద్యార్థుల అంశాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నాడని, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం రివ్యూ చేయటం లేదని విమ‌ర్శించారు.

మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే సరిపోయిందని దుయ్య‌బ‌ట్టారు. ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లైనా ఫీజు నియంత్రణ జరగకపోవటం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేయలేదంటూ ఈ ముఖ్యమంత్రి గతంలో విమర్శించార‌ని… ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లు గడుస్తోందని.. ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారని.. అయినప్పటికీ మన తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగవద్దని నిజామాబాద్ జిల్లాకు నారాయణ, చైతన్య స్కూల్స్‌ను రానివ్వలేదు కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మా జిల్లాకు కూడా ఆ స్కూల్స్ వచ్చేశాయన్నారు. ప్రభుత్వ పరంగా ఈ అంశంపై కచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలని… స్కూల్స్‌లో ఎంప్లాయిమెంట్ విషయంలో మన వాళ్లకు అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌లో వేలాది మంది చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని… వారికి అన్యాయం జరగకుండా మేము పోరాటం చేస్తామ‌న్నారు. పీఎఫ్, మ్యాచింగ్ గ్రాంట్ కట్టని, ఫుడ్ సరిగా లేని స్కూల్స్ పై రైడ్ చేయాలన్నారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్స్‌కు సంబంధించి 11 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని.. వాటిలో ఇంజనీరింగ్ కాలేజీల‌కు సంబంధించి 7 వేల 5 వందల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఫీజులు చెల్లించకపోవటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. కాలేజ్ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్స్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు వచ్చే బకాయిలను మీ తరఫున పోరాటం చేసి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామ‌న్నారు. డిమాండ్ చేసిన అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జాగృతి పక్షాన అన్ని స్కూల్స్ ముందు ధర్నా చేస్తామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page