శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఘనంగా రంగం, ఘటోత్సవం
హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల చరిత్ర ఉన్న లోయర్ ట్యాంక్‌బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో సోమవారం రంగం, ఘటోత్సవం, పోతురాజుల విన్యాసాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వ హించి బ్యాండ్ మేళాలతో ఉరేగింపుతో ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం అమ్మవారి దేవాలయంలో పూజారి బలిహరణలు జరిపి, ఉరేగింపుగా హుస్సేన్‌సాగర్‌లోని గంగాదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్ ఘటోత్సవం నిర్వహించారు. మండపంలో అమ్మవారిని ఆవాహన చేసి కల్యాణం నిర్వహించారు. సోమవారం రాత్రి కుమారి స్వర్ణలతతో రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply