Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsధాశరధి థియేటర్‌లో "ఆ-మ” అనే లఘుచిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌

ధాశరధి థియేటర్‌లో “ఆ-మ” అనే లఘుచిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దాశరథి థియేటర్‌లో శుక్ర‌వారం సాయంత్రం ప్రముఖ హస్త కళా కారిణి, ‘హస్త కళా శిరోమణి’ పి.కమలా ప్రసాదరావు సృష్టించిన, “హర్ ఆర్ట్ గాలరీ” డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, “ఆ-మ” అనే లఘుచిత్రం ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ “హర్ ఆర్ట్ గాలరీ” విశేషాలను తెలియచేసే ఈ డాక్యుమెంట‌రి చిత్రానికి ప్రముఖ సినీ దర్శకులు, శ్రీ రేలంగి నరసింహారావు దర్శకత్వ పర్యవేక్షణ, గౌతమ్ చిత్రీకరణ, ఎంవిఆర్ఎస్ఎస్‌.మూర్తి దర్శకత్వం వహించగా, స్క్రీన్ ప్లే ఎడిటింగ్, నిర్మాత సంస్కృతి రత్న, కె.ధర్మారావు నిర్వహించారు. తరువాత ప్రదర్శించిన “ఆ-మ” లఘుచిత్రం నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్ ఆవేదనకు అద్దం పట్టింది. టర్టిల్ మీడియా క్రియేషన్స్ నిర్మించిన ఈ “ఆ-మ” చిత్రంలో ప్రధానమైన ట్రాన్స్ జెండర్ పాత్రలో కింగ్ కరణ్ ఒదిగిపోయారు. రచన దర్శకత్వం సత్యజిత్ శ్రీకూర్మం. క్రియేటివ్ హెడ్గా ఉదయభాస్కర్, సాంబరాజు వ్యవహరించారు. చిత్ర ప్రదర్శనల అనంతరం దాశరధి ఫిలిమ్ సొసైటీ అధ్యక్షులు వినయ్ కుమార్, ధర్మారావు “హర్ ఆర్ట్ గ్యాలరీ “ఆ-మ” చిత్ర బృందాలను సత్కరించి అభినందనలు తెలియ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page