Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం...

ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్‌కుమార్‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.భూంప‌ల్లి అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఆరెక‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అధ్య‌క్షుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ… నిజాం కాలం నుండి నేటి వరకు ఒక అణా పైసా నుండి నేడు రూ.25 లు వరకు మేకను వధించినందుకుగాను ప్రభుత్వానికి పన్ను రూపంలో ప్రతి మేకల మండిలో మా ఆరెకటికలం పన్ను చెల్లిస్తున్నామ‌న్నారు. 9 మేకల మండీలు రాష్ట్రంలో ఉన్నాయని, ప్రతి రోజు వేలాది మేకలకు, గొర్లను వధిస్తూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం అందిస్తున్నది ఆరెకటికలే అని అన్నారు. లక్షలాదిగా ఆరె కటికల జనాభా ఉందని తెల్సినా రవీంద్రభారతిలో మార్చి 11న వేలాది మందితో సభ జరిపినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కులానికి కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం సభను ఏర్పాటు చేసుకున్నా మా ఆరెకటికలకు న్యాయం జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో 4 శాతానికి పైగా జనాభా ఆరెకటికలదని, 13 కులాలను రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని గత జూన్ నెలలో ప్రకటించిందన్నారు. మా కులం పేరు ఆ లిస్టులో లేదని.. ఇది అన్యాయమని బిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విన్నవించినా ఇంత వరకు అసెంబ్లీలో ప్రస్తావన లేదన్నారు. ఎంఎఎల్ అనిరుద్ రెడ్డి ఇంటి గ్రేటెడ్ మార్కెట్‌లో మటన్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిథులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరార‌ని తెలిపారు. 2020 నుండి 2023 సంవ‌త్స‌రం వరకు 10 మంది ఉరివేసుకుని ఆత్మహత్యల పాల‌య్యార‌ని.. మటన్ వృత్తిని సాగించలేక అప్పులపాలై కుటుంబ పోషణ భారమై బలవన్మరణాలకు గురైన కుటుంబాలెన్నో ఉన్నాయ‌న్నారు.

“సారా వృత్తి మటన్ వృత్తి” మాదే -జన్మత వృత్తిదారులం, కులవృత్తి మాదని.. ఈ సంవత్సరము జులై లో జరిగే వైన్స్ టెండర్లలో సైతం 30 శాతం రిజర్వేషన్ ఆరె కటికటలకు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం బిసి –డి నుండి బిసి-ఎ హోదా కల్పిస్తూ జి.ఓ. తేవాలన్నారు. ప్రభుత్వం మటన్ షాపులకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలని, బొక్నా బోటీ సెంటర్లకోసం మహిళలకు రూ.3 లక్షలు 90 శాతం సబ్సిడీతో ఏ షరతులు లేకుండా ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఆరెకటికలకు గొర్లపంపిణీ చేయాలని, ప్రభుత్వం వైన్స్ టెండర్లులో 30 శాతం రిజర్వేషన్‌ను ఇవ్వాల‌న్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని మేకల మండీలను ఆధునికరించి ఆరెకటికలకు అప్పగించాల‌ని, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో ఆరెకటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జీవో తేవాలన్నారు. ధర్మవ్యాధుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వ‌ర్‌, ఉపాధ్య‌క్షుడు నాగ‌శేషు, వెంక‌టేష్‌, జాయింట్ కార్య‌ద‌ర్శి శ్రీనివాస్‌, కోశాధికారి కెడి.దినేష్‌, క‌మిటీ స‌భ్యులు కె.వినోద్‌, నాగేశ్వ‌ర్‌, జాన‌కిరామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page