హైదరాబాద్, నవంబర్ 25, అద్దం న్యూస్ : ఆరె కటికలకు 500 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, అంగళ్లలో తై బజార్‌ను రద్దు చేయాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ దాదా అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ… మా ఆరె కటికలు ఆత్మగౌరవంగా బతుకాలంటే గతంలో లాగ ఆత్మహత్యలు జరుగకుండా ఉండాలంటే మా కులానికి ప్రత్యేక కార్పోరేషన్ రూ.500 కోట్లతో ఏర్పాటు చేయాలని, వైన్స్ టెండర్లలో 30 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేవారు. బిసి-డి నుండి బిసి ఎ హోదా కల్పిస్తూ జిఓ తేవాలని, మా మటన్ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఆరె కటిక మహిళలకు రూ. 3 లక్షల బ్యాంకు రుణం 90 శాతం సబ్సిడీతో మటన్ క్యాంటిన్లు, చొక్నాబోటి కర్రీపాయింట్లు ఏర్పాటు చేయాలని, 90 శాతం సబ్సిడీతో గొర్ల పంపిణీ ఇవ్వాలని కోరారు. మటన్ వృత్తి పై 9 మేకల మండీలపై ప్రతియేటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా కుల వృత్తి ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతుందన్నారు. అయినా ఈ 75 సంవత్సరాల కాలంలో మా కులానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, మమ్మల్ని పట్టించుకోలేదని.. మాకు అన్యాయం జరిగిందన్నారు.

2020 నుండి 2023 సంవత్సరం వరకు 10 మంది ఉరివేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని, మటన్ వృత్తిని సాగించలేక అప్పులపాలై కుటుంబాల్ని పోషించుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. “ మటన్ వృత్తి- సారా వృత్తి ” జన్మత: మాదే అయినా మాకు గత ప్రభుత్వం 2021లో నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసిందని విమర్శించారు. అప్పటి ఎక్సైజ్‌మంత్రి గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు శాతం ఏ మాత్రం సంబంధంలేని వీరికి కట్టబెట్టిండన్నారు. ఈ సమావేశంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం నాయకులు వెంకటేశ్వరి, క్రిష్ణ, జగదీష్, రాజేష్, విజయ, సాయి రాజ్, శ్రీనాథ్, రాజు, మనోహర్, దినేష్, సరస్వతి, తులసి, జహంగీర్, నాగేశ్వర్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply