హైదరాబాద్, అద్దం న్యూస్ : హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గురువారంహోమియో వైద్య పితామహుడు డా.హనిమన్ జయంతిని పురస్కరించుకొని వృద్ధుల కొరకు ప్రత్యేక ఔట్ పేషెంట్ స్పెషాలిటీని నగరంలో గురువారం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్టు , తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.జితేందర్ రావు తనుగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.శామ్యూల్ హనిమన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. వృద్ధుల స్పెషాలిటీలో సేవలు అందించడానికి సీనియర్ హోమియోపతి వైద్యుడు డా.జి. దుర్గాప్రసాద్ రావు ప్రతి రెండు, నాలుగవ గురువారం 4 నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని మెడికల్ డైరెక్టర్ డా.కె.గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి క్లినికల్ డైరెక్టర్ డా.వేణుగోపాల్ గౌరి, డా.ముస్కాన్ అగర్వాల్, డా.ఆదిత్య, డా.సి.ప్రగతి, డా.క్రిస్తా, డా.బ్యూల పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply