Saturday, September 19, 2026
No menu items!
HomeNationalఅసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి – స్పీక‌ర్‌కు వినతి...

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి – స్పీక‌ర్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ కవిత

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. యూనైటెట్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ…. ఏప్రిల్ 11న పూలే జయంతికి ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ఇనుమడింపజేస్తుందన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం బీసీల చిరకాల కోరిక అని అన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసనరం ఉందన్నారు. స్పీకర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మా రెడ్డి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో- కన్వీనర్ బొల్ల శివ శంకర్ , జాగృతి నాయకులు శ్రీధర్ రావు త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page