వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి
– ఆబ్కారి శాఖ కమిషనర్ కు లెటర్లను ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 12, అద్దం న్యూస్ : వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ని, జిల్లా ఎక్సైజ్ శాఖ డిపిఈఓ శ్రీనివాసమూర్తిని కలిసి వినతి పత్రాలను అశోక్ దాదా అందచేశారు. ఈ సందర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ… వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే కల్పించాలని ఆబ్కారి శాఖ కమిషనర్ కు లెటర్లను ఇవ్వాలని కోరారు. మటన్ వృత్తి, సారా వృత్తి జన్మతః ఆరె కటికలదేనని, 2021లో అప్పటి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసిందన్నారు. బిసి డి నుంచి బిసి ఏ హోదా కల్పిస్తూ జిఓ తేవాలన్నారు. రాష్ట్రంలోని మేకల మండిలను ఆధునీకరించి ఆరె కటికలను అప్పగించాలని, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో ఆరె కటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జిఓ తేవాలన్నారు.
వైన్స్ టెండర్లలో 30 శాతం ప్రత్యేక కార్పొరేషన్‌ను కల్పించాలని, 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమోరాండాలను అందచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మక్కాజి, కొండపాక బాలకృష్ణ, జి.మధుసూదన్, జి.బాలరాజ్, జి.రమేష్, జి.ఈశ్వర్ లాల్, ఈశ్వర్ లాల్, బి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply