Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆరె కటికలను బిసి ఏ లోకి చేర్చాలి

ఆరె కటికలను బిసి ఏ లోకి చేర్చాలి

📰 Generate e-Paper Clip

 

కాచిగూడ, అద్దం న్యూస్ :   ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరె కటికలను ( బిసి డి ) గ్రూప్ నుంచి ( బిసి ఏ ) గ్రూపులోకి మార్చాలని ఆరె కటిక సంగ్ ఇసామియా బజార్ అధ్యక్షుడు హెచ్.రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నింబోలా అడ్డా ఏకే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో ఆరె కటికలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని వివరించారు. ఆరెక టికలకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా ఆరె కటిక్ సాంగ్ ఆధ్వర్యంలో వృద్ధాప్య‌ పెన్షన్లు, పేద విద్యార్థులకు నోట్, టెక్స్ట్ బుక్స్, బ్యాగుల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు,పేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నేర్పుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జ్ఞానేందర్, ఉపాధ్యక్షుడు సాయి సచితనంద్, కోశాధికారి సూర్య ప్రకాష్ సింగ్, హరి నారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ,శంకర్, నరహరి, శ్యాంసుందర్, రఘునాథ్, సతీష్ తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page