అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలి
– రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, జస్టిస్ చంద్రకుమార్
ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో జరిగిన దీక్షలో పాల్గొని జక్కుల వంశీ కృష్ణతో కలిసి అభివాదం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు
హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ లు డిమాండ్ చేశారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అమలు చేయాలని, జూనియర్ అడ్వకేట్లకు 15 వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని, అమెండ్ 41 ఏ, సిఆర్ పిసీ ( 35 (3) ( బిఎన్ఎస్ఎస్ ) లో మార్పులు చేయాలని, నూతన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ ( టిజెఎఎ ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లోన్యాయవాదుల న్యాయ దీక్ష జరిగింది. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా న్యాయవాదులపై పెరుగుతున్న దారుణ దాడులు, రోలో హత్యలు చేయడం దారుణమన్నారు. భయంతో న్యాయవాది నోరుమూసివేస్తే ప్రజలకు న్యాయం ఉండదని హెచ్చరించారు.
15 వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ అడ్వకేట్లు డిమాండ్ చేస్తున్నారని, కానీ వాస్తవానికి అది కూడా తక్కువే అని అన్నారు. రూ. 20 వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు తులసి రామ్, గిరీష్, శ్యామ్, సూర్య, సురేష్, మహేంద్ర, నరేష్, నవీస్, సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బిసి సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బిసి నాయకులు వేముల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply