అహల్యా బాయి హోల్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి
మాట్లాడుతున్న మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి
హైదరాబాద్, మే 27, అద్దం న్యూస్ : అహల్యా బాయి హోల్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని బీజేపీ తెలంగాణ సంస్థా గత ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారిణి, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. రంగారెడ్డి రూరల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్‌లో ప్రముఖ సామాజిక వేత్త అహల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతా మూర్తి పాల్గొని అహల్యా బాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అహల్యా బాయిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆమె ఆశలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రముఖ ప్రవచన కర్త డాక్టర్ అనంత లక్ష్మి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత పంకజ శ్రీనివాసన్, బీజేపి రంగా రెడ్డి అధ్యక్షుడు రాజ్ గోపాల్ గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply